విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. 8% ఫిట్ మెంట్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ అంగీకారం తెలిపింది. మాస్టర్ స్కేల్ రూ. 2.60 లక్షలు ఇచ్చేందుకు మంత్రుల సబ్ కమిటీ నుంచి ఆమెదం లభించడంతో సమ్మె నోటీసు ఉపసంహరించుకున్నట్లు ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రకటించింది. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేశాయి.పే స్కేలు నిర్థారించేందుకు డిస్కంల సీఎండీలతో కమిటీని ప్రభుత్వం నియమించనుంది. డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసేలా ఒప్పందం చేసుకున్నారు. కమిటీకి ఏపీజెన్‌కో ఎండీ నేతృత్వం వహించనున్నారు.