Breaking News:గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

By :  Bharath
Update: 2023-12-07 15:40 GMT

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తోన్న గ్రూప్-2 నోటిఫికేషన్ వచ్చింది. పలు విభాగాల్లో 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్షను నిర్వహించనున్నారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసారి గ్రూప్- 2 పరీక్ష కొత్త సిలబస్, కొత్త నియామక ప్రక్రియలో ఉంటుందని అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. కాగా గ్రూప్- 2 పోస్టులకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags:    

Similar News