వర్సిటీ అధ్యాపకులు రిటైర్మెంట్ వయసు పెంచిన జగన్

Update: 2023-07-29 17:13 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల అధ్యాపకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీపికబురు చెప్పారు. వారి పదవీ విరమణ వయసును ప్రస్తుతమున్న 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీల్లో పనిచేస్తూ యూజీసీ స్కేలు పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. సంబంధిత వివరాలను ప్రభుత్వం అన్ని వర్సిటీ రిజిస్ట్రార్లు పంపింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు ఇదివరకు 60 ఏళ్లు మాత్రమే ఉండగా తర్వాత 62కు పెంచారు. దీన్ని జగన్ మరో మూడేళ్లు పొడిగించారు. అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తుండగా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News