ఆంధ్రప్రదేశ్ మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 16వ తేదిన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే సభలో వైఎస్సార్ చేయూత పథకం కింద ఇచ్చే నగదును జమ చేయనున్నట్లు తెలిపింది. సీఎం జగన్ ఆరోజు కుప్పంలో బటన్ నొక్కి డబ్బుల్ని అకౌంట్లలో జమచేయనున్నారు. ఆ తర్వాత సభలో ఆయన ప్రసంగించనున్నారు. వైఎస్సాఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.18,750లను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వం ఈ నగదును అందిస్తూ వస్తోంది.
అలాగే ఫిబ్రవరి 21వ తేదిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేస్తామని, 24వ తేదిన కర్నూలు నుంచి వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఫిబ్రవరి 27వ తేదిన గుంటూరులో విద్యా దీవెన కింద నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 5వ తేదిన సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన కింద రెండో విడత నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. వాలంటీర్ల వందనం కార్యక్రమం కూడా ఫిబ్రవరి నాలుగో వారంలోనే ఉండే అవకాశం ఉంది.
ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం నెలకు రూ.10 వేలు ఉన్నవారికి, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల ఆదాయం ఉన్నవారికి, కుటుంబం కింద 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి ఉన్నవారికి వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఏడాదికి రూ.18,750లను ఇవ్వనున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఫిబ్రవరి 16వ తేదిన వైఎస్సార్ చేయూత నగదును జమచేయనుంది.