నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Byline :  Krishna
Update: 2023-08-29 04:10 GMT

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థికశాఖ అనుమతిచ్చింది. గ్రూప్ 1లో 89 , గ్రూప్ 2లో 508 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార, బీసీ సంక్షేమ శాఖ, ఆర్ధిక, హోం, మున్సిపల్, రెవిన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా శాఖల్లో గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. గ్రూప్ 1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉద్యోగాలు వంటివి ఉన్నాయి. ఇక ఏపీ ఆర్ధిక, సాధారణ పరిపాలన, న్యాయ, లెజిస్లేచర్ శాఖల్లో గ్రూప్ 2 పోస్టులు భర్తీ కానున్నాయి. గ్రూప్ 2 కేటగిరీలో డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ అఫీసర్, ఎక్సైజ్ ఎస్ఐ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ IIతో సహా పలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

Tags:    

Similar News