డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్లు.. వాళ్లకు రేపటి నుంచి అమలు

Update: 2023-08-03 16:46 GMT

కేంద్ర ప్రభుత్వం పరివాహన్ సేవా పేరుతో దేశవ్యాప్తంగా డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ విషయంలో వాహనదారుల ఇబ్బందులను గుర్తించి, ఇక నుంచి ఫోన్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఏదైనా సందర్భంలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు పోలీసులు వాహనాన్ని ఆపి, డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే వెంటనే మొబైల్ ఫోన్‌లోనే అక్కడికక్కడే డౌన్‌లోడ్ చేసి లైసెన్స్‌ను చూపించేలా వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించింది. పేపర్ లెస్ డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 4) నుంచి అమలు చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మారుతున్న కాలానికి అనుగుణంగా.. డిజిటలైజేషన్ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా చాలామంది వాహన దారులకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. డిజి లాకర్ తో పాటు ఎం- పరివాహన్ అప్లికేషన్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇక నుంచి పోలీస్ అధికారులు లైసెన్స్ అడిగితే.. పేపర్ లెస్ గా యాప్ లో అప్పటి కప్పుడు డౌన్ లోడ్ చేసుకుని చూపించొచ్చు.

Tags:    

Similar News