ఆంధ్రప్రదేశ్ పోలీసులకు షాక్ ఇస్తూ.. జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పోలీసులకు కల్పించే వివిధ అలవెన్స్ల్లో కోత విధిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.79 ప్రకారం ఈ నెల నుంచే జీతాల్లో కోత పడనుంది. దీంతో దిశ సిబ్భందికి అంతకుముందు కేటాయించిన 30 శాతం అలవెన్స్ను, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే యాంటీ నక్సలిజం స్వ్కాడ్ (ఏ.ఎన్.ఎస్) సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్ను కూడా పూర్తిగా తొలగించింది. డిప్యూటేషన్పై పని చేస్తున్న వాళ్ల అలవెన్స్ 30 నుంచి 25 శాతానికి, ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయిన వాళ్ల అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదించింది. కానిస్టేబుల్స్ సైకిల్ అలవెన్స్ను ఎత్తేసింది. ఏజెన్సీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు అందించే అడిషనల్ హెచ్ఆర్ఏను కూడా తొలగించింది.