Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

By :  Krishna
Update: 2023-10-17 06:51 GMT

స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ను ఆయన కుటుంబానికి ఇచ్చేలా ఆదేశాలివ్వాలని బాబు లాయర్లు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఆదేశించింది.

మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇవాళ సుప్రీం విచారణ జరపనుంది. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలను విన్నది. ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు మరోసారి విచారణ చేపడతామని సుప్రీం తెలిపింది. నేరం ఐదేళ్ల క్రితం జరిగినా ఎఫ్ఐఆర్ ఇప్పుడు నమోదు చేయొచ్చని.. 17ఏ అనేది అవినీతికి రక్షణ కాకూడదని సీఐడీ తరుపు అడ్వకేట్ వాదించారు. ఈ అయితే ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరుపు లాయర్లు వాదించారు. ఈ కేసులో ఇవాళ్టితో వాదనలు ముగుస్తాయని తెలుస్తోంది. అయితే కోర్టు వెంటనే తీర్పునిస్తుందా.. లేక రిజర్వ్ చేస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది

Tags:    

Similar News