టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక కేసు, మద్యం కేసుల్లో చంద్రబాబుపై పలు రకాల కేసులు నమోదైన విషయం తెలిసిందే. కాగా కొల్లు రవీంద్రకు కూడా హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక కేసు, మద్యం కేసుల్లో అక్రమాలు జరిగాయంటూ.. గతంలో ఏపీ సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక కేసు, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగియగా.. హైకోర్ట్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించింది.