మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం (ఆగస్టు 21) కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శికి ఏపీ హైకోర్టు ఊరటనిస్తూ.. ఆ సంస్థలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎటువంటి దాడులు చేయవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఏపీలోని మార్గదర్శి బ్రాంచ్లపై పలు ప్రభుత్వ శాఖలు తాజాగా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా ఏపీ సీఐడీ అధికారులు మార్గర్శిలో తనిఖీలు చేస్తున్నారు. కాగా మార్గదర్శికి సంబంధించి ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పలువురు మార్గదర్శి బ్రాంచి మేనేజర్లను అరెస్ట్ కూడా చేశారు. వీటిపై ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి దాడులు, అరెస్టులు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.