Chandrababu Naidu : చంద్రబాబు బెయిల్పై తీర్పు రిజర్వ్ ..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడన్న అంశంపై కూడా మంగళవారమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ తోపాటు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు.
మధ్యంతర బెయిల్ పిటిషన్పై చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరుపక్లాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.