చంద్రబాబు బెయిల్ షరతులపై సీఐడీ పిటిషన్.. తీర్పు రిజర్వ్..

By :  Krishna
Update: 2023-11-01 11:15 GMT

టీడీపీ చీఫ్ చంద్రబాబు మధ్యంతర బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిపింది. చంద్రబాబు బెయిల్పై ఆంక్షలు విధించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా షరతులు విధించాలని.. మీడియాతో మాట్లాడకుండా ఉండేలా ఆదేశించాలని కోరింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారంటూ వీడియో క్లిప్పింగ్స్‌ను సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేశారు. కోర్డు ఆదేశాలు ఉన్న తర్వాత కూడా మీడియాతో మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

సీఐడీ తీరుపై బాబు తరుపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఎక్కడా అతిక్రమించలేదని చెప్పారు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదన్నారు. సీఐడీ చెబుతున్న షరతులు ఆయన హక్కులు హరించే విధంగా ఉన్నాయని వాదించారు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నవంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని తెలిపింది

Tags:    

Similar News