సమాజానికి ఏం సందేశం ఇద్దామని.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

Update: 2023-06-15 05:43 GMT

అడ్వకేట్‌ కమిషనర్‌పై చేయిచేసుకున్న ఘటనలో హిందూపురం 1 టౌన్ సీఐ ఇస్మాయిల్‌పై సరైన చర్యలు తీసుకోలేదని రాష్ట్ర డీజీపీపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధ్యతగా ఉండాల్సిన సీఐ దుష్ప్రవర్తనకు పాల్పడటం తీవ్రమైన చర్యగా కనిపించడం లేదా అంటూ డీజీపీని ప్రశ్నించింది. సీఐపై కరుణ చూపుతున్నట్లు కనిపిస్తోందని.. మైనర్‌ పనిష్‌మెంట్‌తో వదిలేస్తారా అని ప్రశ్నించింది. సమాజానికి ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

కోర్టు ఆదేశాలను సీఐ అవహేళన చేశారని.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంది హైకోర్టు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. అలాగే సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐని ఆదేశించింది ధర్మాసనం. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఆదేశించింది. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారు దుష్ప్రవర్తనకు పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. డి.గిరీష్‌ అనే వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్ పై హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఈ విచారణ జరిపింది. 

Tags:    

Similar News