AP High Court: జగన్ కోడికత్తి కేసు విచారణపై హైకోర్టు స్టే..

By :  Krishna
Update: 2023-10-17 08:39 GMT

సీఎం జగన్పై కోడికత్తి దాడి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. 8 వారాల పాటు విచారణ వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఇదే కేసులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ను ఆరువారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ జగన్ పిటిషన్ వేశారు. జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది.

2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్పై శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోడి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో జగన్ మోచేతికి గాయమైంది. తొలుత ఈ కేసును సిట్ విచారించగా.. సిట్ పై నమ్మకం లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని కోర్టును కోరారు. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ కేసు దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో కుట్ర కోణం ఉందని బాధితుడు భావిస్తున్నందున లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని జగన్ తరపు న్యాయవాదులు విశాఖ కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణపై 8వారాలపాటు స్టే విధించింది.

Tags:    

Similar News