kodi kathi case : కోడికత్తి కేసులో ఏపీ హైకోర్టు తీర్పు..ఐదేండ్ల తర్వాత నిందితుడికి బెయిల్

Update: 2024-02-08 07:50 GMT

గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు నిచ్చింది. శ్రీనివాస్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు కొన్ని ఆంక్షలు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది.

శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి..ఇవాళ తీర్పును వెల్లడించింది. అయితే గత ఐదేళ్లుగా శ్రీనివాస్ జైల్లో మగ్గిపోతున్నారు. గత 2018 అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. కాగా ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ విచారణలో తేల్చినప్పటికీ..అప్పటి నుంచి ఇప్పటి వరకు నిందితుడికి బెయిల్ మంజూరు కాలేదు. ఈ కేసులో సీఎం వైఎస్ జగన్ ఎన్‌వోసీ ఇవ్వాలి లేదా వచ్చి వాదనలు వినిపించాలి అని కోరినప్పటికీ ఆయన రాలేదు. గత ఐదేళ్లలో సాక్షం చెప్పేందుకు సీఎం జగన్ ఒక్క రోజు కూడా కోర్టుకు హాజరుకాకపోవడం గమనార్హం.

మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు ఆంక్షలు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాతో చర్చించకూడదని ఆదేశించింది. అంతేగాక వారానికి ఒకసారి ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని తెలిపింది. ఐదేండ్ల తర్వాత బెయిల్ రావడంతో హైకోర్టు తీర్పుపై దళిత, పౌరహక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేయాయి. 

Tags:    

Similar News