మార్గదర్శి కేసులో జగన్ సర్కార్‎కు మరో ఎదురుదెబ్బ..

Update: 2023-08-11 13:14 GMT

మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శికి చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ అందించిన నోటీసుల ఆధారంగా తీసుకోబోయే చర్యను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు పేర్కొంది.చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొద్దిరోజుల క్రితం మార్గదర్శి చిట్స్‌కి చెందిన కొన్ని గ్రూపులను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఫిర్యాదులు లేకుండా చిట్లను నిలిపివేయటంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది.

ఇటీవల మార్గదర్శికి వ్యతిరేకంగా దినపత్రికల్లో ఫుల్ పేజి పేపర్‌ యాడ్‌లు కూడా ప్రభుత్వం ఇచ్చింది. చిట్స్‎ను మూసేస్తామని తొలి సారి మార్గదర్శిపై ప్రకటనలు ఇచ్చారు. దీనిపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

ap highcourt stay on margadarsi case

ap highcourt, stay,margadarsi case, ycp government

Tags:    

Similar News