రేపే ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు..

Update: 2023-06-12 16:32 GMT

ఏపీలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫలితాలకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం సాయంత్రం 5గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరి బాబు విడుదల చేయనున్నారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరిగాయి. కాగా ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు తమ రిజల్ట్‌ను https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు ఇంటర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్ కు సంబంధించిన పరీక్షలకు 9,20,552 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి అవ్వగా.. ఫస్టియర్లో 61 శాతం మంది, సెంకడియర్లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.


Tags:    

Similar News