కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్

Update: 2023-06-23 10:23 GMT

తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో ఉన్న భూముల ధరలు హైదరాబాద్‌లో కూడా లేవని తెలిపారు. ఒక్క హైదరాబాద్ నగరాన్ని పట్టుకొని తెలంగాణ మొత్తం ఏదో జరిగిపోతుందనే భావనను సృష్టిస్తున్నారని విమర్శించారు. విశాఖతో పాటు విజయాడ, నర్సీపట్నం, ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉన్నాయని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం ఇతర రాష్ట్రాలను కించపరచడం తగదన్నారు. భూముల ధరల సంగతి ఎవరో తన స్నేహితుడు చెప్పాడని కేసీఆర్ అనుంటే బాగుండేది... కానీ చంద్రబాబు చెప్పాడంటే ఆ మాటలను ఎవరూ నమ్మరని అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఏమన్నారంటే..

పటాన్ చెరులో నిర్వహించిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో భూముల విలువ పూర్తిగా పెరిగిపోయిందని చెప్పారు. ఇక్కడ ఒక్క ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 50 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటూ.. చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమే అవుతాయని సీఎం చెప్పారు. పటాన్‌చెరువులో నేడు ఎకరం భూమి ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నది. ఇలా ఐతే ఆంధ్రాకు వెళ్లి 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News