Minister Roja : లోకేశ్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్.. తరిమికొట్టడం ఖాయం.. మంత్రి రోజా

Byline :  Veerendra Prasad
Update: 2023-12-23 08:08 GMT

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం ముగింపు సభ తర్వాత అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటకు మాట పెరుగుతోంది. లోకేశ్‌, పవన్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు విరుచుకుపడుతుంటే.. నేరుగా జగన్‌వైపే విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు టీడీపీ నేతలు. దీంతో ఏపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు లోకేశ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి రోజా ఫైర్ అయ్యారు.

సీఎం జగన్ బర్త్ డే రోజున.. విద్యార్థులకు మేనమామలా, వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ ట్యాబ్ లు పంపిణీ చేస్తుంటే దాన్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్‌కు ఉంది కాబట్టి, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేశ్‌కు ఎలాంటి ఎమోషన్స్ లేవని, తారక రత్న చనిపోయినా పట్టించుకోలేదన్నారు. జగనన్న పాదయాత్ర చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా 4వేల కిలో మీటర్లు, 400 రోజులు అని చెప్పి 40 కి.మీ కూడా కంటిన్యూగా నడవలేదన్నారు.

200 రోజులు అని చెప్పి లోకేశ్‌... 200 సార్లు బ్రేక్ తీసుకున్నాడని, అతనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అన్నారు. 4 కోట్ల లోకల్ ఓటర్లు, 4 నాన్ లోకల్ లీడర్స్ కు మధ్య రానున్న ఎన్నికలు జరగబోతున్నాయని, ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ను ప్రజలు తరిమి కొడతారని చెప్పారు. 




Tags:    

Similar News