Roja : సీఎం రేవంత్‌పై మంత్రి రోజా ఫైర్..చేపల పులుసు వ్యాఖ్యలపై దుమారం
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏపీ మంత్రి రోజా చేపల పులుసు వండిపెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతు తాను ఎవరి కోసమూ చేపల పులుసు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన ఇంటికి ఎప్పుడొచ్చారో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు..జాక్‌పాట్‌లో సీఎం అయిన రేవంత్ ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, జగన్ ఇద్దరూ రోజా వండిన చేపల పులుసు తిన్నారని.. ఆ తర్వాత తెలంగాణ వాటా నీళ్లను రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ఇచ్చారని ఆయన విమర్శించారు. గతంలోనూ సీఎం రేవంత్ రెడ్డిపై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోవర్టుగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. గతంలోనూ రేవంత్ రెడ్డి చేపల పులుసు వ్యాఖ్యలు చేయగా.. తమ ఇంటికి సీఎం జగన్ ఎప్పుడు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాదని.. కోవర్టు రెడ్డని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ టీడీపీ నేతలను కలవడంలోనే అతను కోవర్టని తెలుస్తోందన్నారు. 28 వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు డిన్నర్ ఇవ్వడం మరచిపోయారా అంటూ నిలదీశారు. కేసీఆర్, జగన్ తన ఇంట్లో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది చాలా బాధాకరమని రోజా అన్నారు