సచివాలయంలో ఏం పనిచేస్తారో తెలియనోడు సీఎం అవుతాడట: మంత్రి సీదిరి
By : Mic Tv Desk
Update: 2023-07-16 04:34 GMT
జనసేన అధినేత పవణ్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ను జగ్గూభాయ్ అంటూ పిలుస్తాడని పవణ్ చేసిన వ్యాఖ్యలపై అప్పలరాజు ఫైరయ్యారు. తాము కూడా పవణ్ ను పీకేగాడు, వీపీగాడు అని ఏకవచనంతో అనగలమని చెప్పుకొచ్చారు. పవణ్ ఓ రాజకీయ వ్యభిచారని, తాగేసి మాట్లాడే ఓ పనికిమాలినోడని విమర్శించారు. చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ లు చదవడం తప్ప ఇంకేం తెలవదని ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఏం పనిచేస్తారో తెలియనోడు సీఎం అవుతాడంట అని నిలదీశారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పుడు పవన్ ఐస్క్రీమ్ తింటున్నాడా? అని సీదిరి ప్రశ్నించారు. పవణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని.. తనకు దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేశారు.