ఏపీ మంత్రి విశ్వరూప్ తిరుమల వెంకన్న సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల పర్యటనలో ఉన్న విశ్వరూప్ మీడియాతో మాట్లాడారు."పవన్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాదు నేను కూడా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఎవరైనా ఎప్పుడైనా యాత్రలు చేసుకోవచ్చు. సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో గెలవాలి. పొత్తులతో 100 స్థానాల్లో పోటీ చేస్తే ఎంతలేదన్నా 50 స్థానాల్లో అయినా గెలవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా ముఖ్యమంత్రి అవుతారని విశ్వరూప్ అన్నారు.