Ap Mlc : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కన్నుమూత
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఏలూరు నుంచి భీమవరం వెళుతున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును.. ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటనలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్ , గన్‌మెన్ తీవ్ర, పీఏ లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరిని ఆసుపత్రికి తరలించారు.
షేక్ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఏలూరులో అంగన్ వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి భీమవరం వెళ్తుండగా .. ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. అందుకే ఆయన చాతికి, తలకు తీవ్ర గాయాలు కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం.