పవన్ కళ్యాణ్కు ఏపీ పోలీసుల నోటీసులు

By :  Krishna
Update: 2023-10-04 07:34 GMT

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ పెడనలో జరగనున్న వారాహి యాత్రలో కొందరు దాడులు చేస్తారంటూ మంగళవారం పవన్ వ్యాఖ్యానించారు. ఈ దాడులపై తమకు విశ్వసనీయం సమాచారం ఉందని అన్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. దాడులపై సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని.. తగిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.

‘‘దాడులు జరగుతాయనే సమాచారం పవన్కు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియజేయాలని నోటీసుల్లో కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్‌ నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఎటువంటి సమాచారంతో పవన్‌ వ్యాఖ్యలు చేశారు.సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే తగిన చర్యలు ఉంటాయి. పవన్‌ కంటే తమవద్ద మెరుగైన నిఘా వ్యవస్థ ఉందని.. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ జాషువా తెలిపారు.


Tags:    

Similar News