ఐఎఫ్‌ఎస్ ఫలితాల్లో ఏపీ విద్యార్థి సత్తా చాటాడు. బాపట్లకు చెందిన శ్రీకాంత్ ఆలిండియాలో మొదటి ర్యాంకును సాధించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు (ఐఎఫ్‌ఎస్) ఫలితాలు శనివారం సాయంత్రం విడుదలయ్యాయి. మొత్తం 147 మంది ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైనట్టు యూపీఎస్సీ ప్రకటించింది. జనరల్ కేటగిరిలో 39 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 21 మంది, ఓబీసీలో 54, ఎస్సీ కోటాలో 22 మంది, ఎస్టీ కోటాలో 11 మంది ఎంపికయ్యారు. కొల్లూరు వెంకట శ్రీకాంత్ మొదటి ర్యాంక్‌తో పాటు, హైదరాబాద్‌కు చెందిన సాహితీరెడ్డి 48వ ర్యాంకు, తొగరు సూర్యతేజ 66వ ర్యాంకు సాధించారు.