TTD : తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి రోజా ఫొటోగ్రాఫర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-02 08:07 GMT

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. అన్యమత గుర్తు ఉన్న గొలుసుతో రోజా ఫొటోగ్రాఫర్‌ స్టెయిన్.. తిరుమల కొండపైకి రావడం.. అక్కడి గొల్లమండపంలో సంచరించడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. తిరుమల కొండలపై అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉన్నప్పటికీ.. మంత్రి రోజా సిబ్బంది.. నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి రోజా గురువారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఆమెతో పాటు ఆమె వ్యక్తిగత ఫొటోగ్రాఫర్ స్టెయిన్ కూడా తిరుమలకు వచ్చారు. తిరుమలలో అన్యమత గుర్తుల ప్రదర్శనపై నిషేధం ఉండగా.. స్టెయిన్ మెడలో అన్యమత గుర్తు ఉన్న గొలుసు కనిపించడం వివాదం చెలరేగింది. గొల్లమండపం సమీపంలో స్టెయిన్ సంచరించడంపై తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం, ఇతర మతాల ఆచారాలకు అస్సలు అనుమతి ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిబంధనలు కూడా పెట్టింది. ఈ విషయం ప్రభుత్వ మంత్రి రోజాకి తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి రోజా తిరుమల దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఫొటోగ్రాఫర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ‘‘రోజక్క తిరుమలకు ఎందుకు అన్ని సార్లు వెళ్తుందో ఇప్పుడు జనానికి ఒక క్లారిటీ వచ్చింది. నిబంధనలకు వ్యతిరేకంగా మెడలో శిలువ లాకెట్ ధరించి, ఏకంగా తిరుమల గొల్ల మండపం ఎదురుగా నిల్చుని హల్ చల్ చేస్తున్న ఇతనెవరో కాదు. రోజక్క పర్సనల్ ఫోటోగ్రాఫర్. మీకర్ధమవుతుందా?’’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేసింది.




Tags:    

Similar News