నిరుద్యోగుల వినూత్న నిరసన.. జాబ్ క్యాలెండర్కు సమాధి.. ఆపై పిండం

Byline :  Bharath
Update: 2024-01-02 12:49 GMT

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. జాబ్ క్యాలెండర్ కు సమాధి కట్టి.. ఆ తర్వాత పిండ ప్రధానం చేశారు. ఏపీ సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ ను సజీవ సమాధి చేశారంటూ.. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన తెలిపారు. ప్రతీ సంవత్సరం ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేసి.. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. 25వేల డీఎస్సీ పోస్టులు, ఖాళీగా ఉన్న 6000 పోలీస్ పోస్టులు, ఇతర శాఖలో ఉన్న ప్రతీ పోస్టును పూరిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసగించారని మండిపడ్డారు.

కోటీ ఆశలతో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు ఐదేళ్లుగా జగన్ మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం జగన్ కు ఏమాత్రం కనికరం లేదని విమర్శించారు. నిరుద్యోగులను నయవంచన చేసిన జగన్ ప్రభుత్వాన్ని సజీవ సమాధి చేస్తామని, బంగాళాఖాతంలో కలిపేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News