జగన్ పుణ్యానే మద్యంలో ఏపీకి స్పెషల్ స్టేటస్..Sharmila Comments

Update: 2024-02-08 07:23 GMT

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యలు స్వీకరించిన తర్వాత వైసీపీ పాలన, జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై షర్మిల ఘాటు విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షర్మిల ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు. స్పీచ్ లో అవకాశం దొరికిన ప్రతిసారి జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యమే ముందుకు సాగుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు, జగన్ పాలనకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకొలేకపోయారని చెప్పారు. మేనిఫెస్టోనే తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేదిస్తామని..ఆ తర్వాతే ఓట్లు వచ్చి అడుగుతానని జగన్ అన్నారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి రాగేనే జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయారని దుయ్యబట్టారు.

అదికాక, కొత్త కొత్త పేర్లతో జగన్ సర్కార్ విపరీతంగా మద్యం అమ్ముతోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏది అమ్మితే అదే కొనాలని తనకు ఒకరు చెప్పారని అన్నారు. అంతేగాక, ఏపీ భూమ్ భూమ్, స్పెషల్ స్టేటస్ వంటి బ్రాండ్ లే దొరుకుతాయని చెప్పినట్లు తెలిపారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకురాని జగన్, మద్యంలో మాత్రం స్పెషల్ స్టేటస్ తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. ఇదంతా జగనన్న పుణ్యమేనని, ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు వచ్చే ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని షర్మిల ప్రశ్నించారు.

Tags:    

Similar News