శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌కు హెచ్ఆర్సీ నోటీసులు

Update: 2023-07-15 03:41 GMT

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌కు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల క్రితం జనసేన కార్యకర్తను కొట్టిన ఘటనకు సంబంధించి అంజూ యాదవ్‌తో పాటు డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, తిరుపతి ఎస్పీ, డిఎస్పీ, అనంతపురం డీఐజీ, తిరుపతి కలెక్టర్ లకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని తిరుపతి డిఎస్పీ,ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిరసన కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన సీఐ అంజూ యాదవ్ ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై దాడికి దిగారు. చెంప దెబ్బలు కొట్టారు. జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపై కూడా ఆమె దాడి చేసి ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. అంజూ యాదవ్ తీరు వివాదాస్పదంగా మారడంతో ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.

Tags:    

Similar News