Degree lecturers Recruitment : పెరిగిన డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పుడంటే?

Byline :  Bharath
Update: 2024-01-24 14:53 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టింది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు.. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 11:59 గంటల వరకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. కాగా మొదట గతేడాది డిసెంబర్ 30వ తేదీన మొత్తం 240 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులోనే మరో 50 పోస్టులను పెంచుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఖాళీల వివరాలు:

మొత్తం 290 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బయోటెక్నాలజీ 4, బోటనీ 20, కెమిస్ట్రీ 23, కామర్స్‌ 40, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 48, ఎకనామిక్స్‌ 15, ఇంగ్లిష్‌ 5, హిస్టరీ 15, మేథమేటిక్స్‌ 25, మైక్రోబయోలజీ 4, పొలిటికల్‌ సైన్స్‌ 15, తెలుగు 7, జువాలజీ 20 ఖాళీలున్నాయి.

జీతం:

ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు ఉంటుంది.

ఏజ్ లిమిట్:

జులై 1, 2023 నాటికి అభ్యర్థుల వయసు 42 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయోపరిమితి, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కేటగిరీ ఉన్నవారికి మూడేళ్ల చొప్పున వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

రూ.250 అప్లికేషన్ ఫీజుతో పాటు.. రూ.120 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలతో పాటు.. మరికొంత మందికి ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు.

పరీక్ష విధానం:

డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్‌ మార్కు (కటాఫ్) ఉంటుంది.

Tags:    

Similar News