RTC Bus : ఆర్టీసీ బస్సుల రంగులు మారుతున్నాయ్

Byline :  Bharath
Update: 2024-02-19 09:37 GMT

ఏపీఎస్ఆర్టీసీకి కొత్త బస్సులొస్తున్నయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్ బస్సుల రంగులు మారుతున్నాయి. ఇదివరకు సూపర్ లగ్జరీ బస్సులకు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి. కాగా ఇప్పుడు బ్లూ, లైట్ పర్పుల్, లైట్ బ్లూ కలర్స్ వస్తున్నాయి. ఆల్ట్రా డీలక్స్ బస్సులు గతంలో పర్పుల్, బ్లూ, తెలుపు రంగుల్లో ఉండేవి. వాటిని తెలుపు, నీలం, ఆరెంజ్ రంగుల్లోకి మార్చారు. విజయవాడ విధ్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్

షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఈ బస్సులను సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం 30 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఈ బస్సులను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News