టెన్షన్..టెన్షన్.. గెలుపు సింబల్ చూపిన చంద్రబాబు అడ్వకేట్

By :  Krishna
Update: 2023-09-10 10:49 GMT

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. మరికాసేపట్లో న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి.

ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం కోర్టు బయటికి వచ్చిన చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయసంకేతం ఇచ్చారు. బొటనవేలు పైకెత్తి అంతా ఓకే అనే సింబల్ చూపించారు. మరోవైపు 409 సెక్షన్ వర్తించదని ఏసీబీ కోర్టు చెప్పడంతో ఇది చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో బాబు పేరు ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా మొదట రూపొందించిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ-1గా చేర్చి.. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టే టైంలో ఏ-37గా సిట్ పేర్కొంది. ఏ-1గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సీఐడీ అభియోగాలు మోపింది.

కాగా చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News