Balakrishna : అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య..స్పీకర్ వార్నింగ్

By :  Aruna
Update: 2023-09-21 06:31 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అయితే దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. వీరి నిరసనతో ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆయన్ని చుట్టుముట్టారు. పేపర్లు విసిరి ప్లకార్డులను పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. ఇదే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో తొడగొట్టి, మీసాలు మెలేశారు. ఈ విషయాన్ని గమనించిన స్పీకర్ బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. సభలో మీసాలు తిప్పడం సరికాదని , సభా సంప్రదాయాలను గౌరవించాలని బాలయ్యకు క్లాస్ తీసుకున్నారు. ఇది మొదటి తప్పుగా భావించి హెచ్చరిస్తున్నామని అన్నారు స్పీకర్. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

Tags:    

Similar News