టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డిపై దాడికి యత్నం...వీడియో వైరల్

Update: 2023-06-04 11:44 GMT

నెల్లూరు టీడీపీ నేత ఆనం వెంకటరమణా రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. నెల్లూరు ఆర్టీఏ కార్యాలయంలో నుంచి వెంకటరమణారెడ్డి బయటకు వస్తున్న సమయంలో 10 మంది దుండగలు దాడి చేసేందుకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరగడంతో కర్రలు, బైకులను అక్కడ వ‌దిలేసి ప‌రార‌య్యారు. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆనం వెంకటరమణా రెడ్డిపై దాడికి ముందే ప్లాన్ వేసుకున్న దుండగులు ముఖానికి ముసుగులు వేసి కర్రలతో ఆర్టీఏ ఆఫీస్ ముందు కాపు కాశారు. ఆనం బయటకు వస్తున్నట్లు గమనించి చేతిలో కర్రలు పట్టుకొని లోపలకి వెళ్లారు. అక్కడున్న టీడీపీ కార్యకర్తలు ఎదురుతిరగడంతో దుండుగులు పరుగులు తీశారు.


ఖండించిన టీడీపీ

ఆనంపై దాడిని టీడీపీ ఖండించింది. వైసీపీ గుండాలే దాడికి ప్రయత్నించారని ఆరోపించింది. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్‌తో పాటు ఇతర నాయకుల అవినీతిపై వెంకటరమణారెడ్డి ఘాటుగా విమర్శలు చేయడంతోనే దాడికి యత్నించినట్లు టీడీపీ ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం ఆనం వెంకటరమణా రెడ్డిని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి,కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇతర నేతలు పరామర్శించారు.

లోకేశ్ ఆగ్రహం

ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా వైసీపీ నాయకుల పనే అని మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాలక తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.





Tags:    

Similar News