అసెంబ్లీలో బాలయ్య అలా చేశాడేంటీ.. వీడియో వైరల్..

By :  Krishna
Update: 2023-09-21 09:46 GMT

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఇవాళ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే చంద్రబాబు అక్రమ అరెస్టు మీద ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే దీనిపై చర్చకు స్పీకర్‌ నిరాకరించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆయన్ని చుట్టుముట్టారు.

ఈ క్రమంలో బాలయ్య వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. అసెంబ్లీలో ఆయన అసభ్యరమైన సైగ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై వైసీపీ నేతలు పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. బాలయ్య సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకుముందు సభలో బాలయ్య తొడగొట్టి మీసాలు మెలేశారు. దీనిపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సభలో మీసాలు తిప్పడం సరికాదని, సభా సంప్రదాయాలను గౌరవించాలని బాలయ్యకు క్లాస్ తీసుకున్నారు. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.


Full View

 


Tags:    

Similar News