అయ్యే.. ఎండల్లో బీర్ల లారీ బోల్తా

Update: 2023-06-05 13:29 GMT

ఎండల్లో చల్లాగా ఓ బీరేసి ఇంటికెళ్దాం అనుకున్న మందు బాబులకు.. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ప్రమాదంలో బోల్తాపడ్డ లారీలో ఉన్నవాళ్లకు సాయం అందించకుండా.. అందులో ఉన్న బీరు కేసులను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై బీరు కేసులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అనకాపల్లి డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా బయ్యవరం వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. అందులో ఉన్న 200 కేసుల బీర్లు నేలపాలయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బీరు బాటిల్ల లారీ బోల్తా పడిందనే వార్త తెలియగానే.. మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పగలకుండా ఉన్న బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు.

Tags:    

Similar News