Bird flu : శరవేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ..చికెన్ తింటే అంతేనట!

Byline :  Vamshi
Update: 2024-02-16 10:45 GMT

మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కొత్త వైరస్ కలవర పెడుతుంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలో బర్డ్‌ప్లూలో కలకలం రేపుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. ముఖ్యంగా పొదలకూరు, కోవూరు మండలాల్లో భారీగా కోళ్లు చనిపోతున్నాయి. అప్రమత్తమైన అధికారులు కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్స్‌ సేకరించి భోపాల్‌లోని టెస్టింగ్‌ కేంద్రానికి పంపించారు. ఇక, బర్డ్‌ ఫ్లూతోనే కోళ్లు చనిపోతున్నాయని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్‌ షాపులు మూసివేయాలని, ‍కిలోమీటర్‌ పరిధిలో ఉన్న చికెన్‌ షాపులు మూడు నెలల పాటు మూసివేయాలని కలెక్టర్‌ తెలిపారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలని సూచనలు చేశారు.

అలాగే, బర్డ్‌ ఫ్లూపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన వెల్లడించారు. దీంతో నెల్లూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా చూడాలన్నారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని తెలిపారు.. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్‌ షాప్‌ యజమానుల్లో చైతన్యం తేవాలన్నారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్‌ చేయించాలని సూచించారు. ఈ బర్డ్‌ ఫ్లూపై ఆ 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్‌ సీఈవో గ్రామసభలు నిర్వహించాలన్నారు. పశు వైద్య ఇతర విభాగాల అధికారులతో కలెక్టర్ హరి నారాయణ్ సమీక్ష నిర్వహించారు. వ్యాధి తీవ్రత ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో నష్టపోయామని కోళ్ల ఫామ్‌ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News