టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయనను అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుబట్టారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడీన ఆయన సీఐడీ వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు. చంద్రబాబు నాయుడుకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చకుండా, వివరణ ఇవ్వకుండా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పుబడుతోందని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే తెలంగాణలో నవంబర్ లేదా డిసెంబర్‌లో అసెంబ్లీ, మార్చి లేదా ఏప్రిల్‌లో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని లక్ష్మణ్ చెప్పారు. జమిలీ ఎన్నికలకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందన్నది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి పాలనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడుతారని ఆయన జోస్యం చెప్పారు. గారడీలు చేస్తూ యువతను ఆగం చేస్తున్న సీఎం కేసీఆర్.. వారి భవిష్యత్తును అంధకారంలో నెట్టారని మండిపడ్డారు.