టీడీపీ, జనసేనకి బొత్స సవాల్.. గుండు కొట్టిచ్చుకుంటానంటూ..
By : Mic Tv Desk
Update: 2023-08-11 16:45 GMT
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడ్డారు. వచ్చే అమావాస్య (సంక్రాంతి) తర్వాత రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని.. ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. ఈ విషయాన్ని తన గొప్పకోసం కాదని, తనకున్న అనుభవం, ప్రజల నాడి తెలిసిన కారణంగా చెప్తున్నానని అన్నారు. ఆ పార్టీ నేతల్లో చిత్త శుద్ధి ఉంటే ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉంటే ఆ పార్టీలు రాష్ట్రంలో ఉంటాయన్నారు. కానీ, టీడీపీ, జనసేనకు ఆ ఉద్ధేశం లేవని.. ఎంతసేపు జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు.