YS Jagan Mohan Reddy : ఏపీలో మెట్రో.. పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Byline :  Bharath
Update: 2023-12-15 11:02 GMT

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రానున్న ఎలక్షన్స్ లో మరోసారి అధికారం చేపట్టే ప్రయత్నం చేస్తుంది. పలు హామీలను అమలు చేసే పనిలో పడింది. తాజాగా ఏపీ సచివాలయంలోని బ్లాక్ 1లో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగానే జననన్న ఆరోగ్య సురక్ష రెండో విడత అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్య శ్రీ చికిత్స పరిధి రూ.25 లక్షలకు పెంపు, సామాజిక పెన్షన్లు రూ.3 వేలకు పెంచుతూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణాన్ని మంత్రులు ఆమోదించారు. దానితో పాటు లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. కుల, ఆదాయ ధృవీకణ ప్రతాల మంజూరులో సంస్కరణలపైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.




Tags:    

Similar News