అవినాశ్ రెడ్డికి మళ్లీ నోటీసులు.. కోర్టుకు రావల్సిందేనన్న సీబీఐ

Update: 2023-07-14 13:49 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కడప వైఎస్సార్ ఎంపీ అవినాశ్ రెడ్డిని వెంటాడుతూనే ఉంది. తాను అమాయకుడినని ఆయన చెబుతుంటే హత్యలో ఆయన హస్తముందని సీబీఐ వాదిస్తోంది. అవినాశ్‌తో పాటు సహనిందితులైన ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డిలకు హత్యతో సంబంధముందని సీబీఐ ఇటీవల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేయగా సీబీఐ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకుంది. కేసు విచారణం కోసం అవినాశ్ ఆగస్ట్ 14న తమ ముందు హాజరు కావాలని శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.

సీబీఐ తన అనుబంధ చార్జిషీటులో అవినాశ్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. 6వ, 7వ నిందితులుగా భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డి పేర్లను ప్రస్తావించింది. వీరిద్దరూ ఇప్పటికే చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వీరి రిమాండ్ ఆగస్టు 14న ముగియనుంది. దీంతో ఆరోజు ముగ్గర్నీ విచారణించారించడానికి కోర్టు సమన్లు జారీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేకా పులివెందులలోని తన స్వగృహంలో గొడ్డలి వేటుతో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నాలుగేళ్లయినా విచారణ పూర్తికాకపోవడం, ఏపీతో తమకు న్యాయం జరగదని ఆయన కూతురి సునీత ఆందోళన వ్యక్తం చేయడంతో సుప్రీ కోర్టు కేసును తెలంగాణకు బదిలీచేసింది. అవినాశ్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు విచారించింది. అయితే ఆయన విచారణకు సహహకరించడం లేదని సీబీఐ చెబుతోంది.

Tags:    

Similar News