nagarjuna sagar : సాగర్, శ్రీశైలం వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ భేటీ వాయిదా
Byline : Kiran
Update: 2023-12-02 08:55 GMT
నాగార్జున సాగర్, శ్రీశైలం వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ భేటీ వాయిదా పడింది. ఈ నెల 6న సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ అధికారుల అభ్యర్థన మేరకు జలశక్తి శాఖ వర్చువల్ మీటింగ్ వాయిదా వేసింది.
సమావేశంలో ఏపీ అధికారులు తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన జలశక్తి శాఖ ఏపీ పంపిన ఇండెంట్పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఆదేశించారు. అప్పటి వరకు సాగర్ నుంచి నీటి విడుదలను నిలిపేయాలని ఏపీకి సూచించారు.