కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు.. కేంద్రం

Update: 2023-07-25 12:29 GMT

తాంబాలాలిచ్చేశాను తన్నుకు చావండి అన్నట్లు ఉంది కేంద్ర ప్రభుత్వ వ్యహారం. ఏపీ విభజన వివాదాలకు పరిష్కారం తమ చేతుల్లో లేదని, రెండు రాష్ట్రాలూ కలసి చర్చించుకుని పరిష్కరించుకోవాలని తేల్చిచెప్పింది. ఏపీ ప్రభుత్వం, కడప జిల్లా వాసులు ఆశతో ఎదురు చూస్తున్న కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటుపైనా నీళ్లు చల్లింది. ఆ ప్రాజెక్టు ఆచరణ సాధ్యం కాదని, అధ్యయనం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చింది. సోమవారం పార్లమెంటులో పలువురు ఏపీ టీడీపీ ఏంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. జగన్ మోహన్ ప్రభుత్వ సహకారంతో జిందాల్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్న కడప స్టీల్ ఫ్యాక్టరీ భవిత్యం కేంద్రం తాజా ప్రకటనతో మళ్లీ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీకి రెండుసార్లు శంకుస్థాపనలు జరిగాయి.

విభజన, కడప ఉక్కు తదితరాలపై కేంద్రం చెప్పిన వివరాలు..

1. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం మధ్యవర్తిగా మాత్రమే ఉంటుంది.

2. ఏపీలో రూ.106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వేజోన్‌ కార్యాలయం నిర్మిస్తాం. 2023-24లో రూ.10 కోట్లు కేటాయించాం.

3. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుఆచరణ సాధ్యం కాలేదు. దగ్గర్లో చాలలా రేవులు ఉండడంతో తీవ్ర పోటీ వల్ల ఇది సాకారం కాకపోయింది. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ కోరింది.

4. రామాయపట్నం నాన్‌- మేజర్‌ పోర్టుగా ఇప్పటికే నోటిఫై అయింది.

5. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఉక్కుశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది.

6. ఏపీ వర్సిటీలకు, పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి కలిపి రూ. 21,154 కోట్లు ఇచ్చాం.

7. ఐఐటీకి ఏర్పాటుకు రూ.1,022 కోట్లు, ఐసర్‌కు రూ.1,184 కోట్లు మంజూరు చేశాం.

8. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.1,319 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.24 కోట్లు, వ్యవసాయ వర్సిటీకి రూ.135 కోట్లు, పోలవరానికి రూ.14,969 కోట్లు అందజేశాం.


Tags:    

Similar News