రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా పోటీపై కార్యకర్తల్లో సందిగ్ధత నెలకొనగా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం టీడీపీకి సుమారు 22మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చే అందరినీ పార్టీలోకి తీసుకోలేమని చెప్పారు. వైసీపీ ముఖ్య నేతలు సైతం టచ్ లోకి వస్తున్నారని.. అయితే ఆలోచించే నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తులు, చేరికలతో పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగొద్దని సూచించారు.