Chandrababu : చంద్రబాబు నోట.. కుర్చీ మడతపెట్టి డైలాగ్

Byline :  Bharath
Update: 2024-02-16 01:59 GMT

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుర్చీని మడతపెట్టి అంటూ.. ఓ రేంజ్ లో సినిమా డైలాగ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై తిరగబడాల్సిన టైం వచ్చింది. ఇంకా 53 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు ఆయన. గురువారం (ఫిబ్రవరి 15) ‘విధ్వంసం’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై సీనియర్‌ జర్నలిస్టు ఆలపాటి సురేశ్‌కుమార్‌ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సమావేశానికి విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్‌వీ రామారావు అధ్యక్షత వహించగా.. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. ఐదేళ్ల నరకాన్ని రాబోయే 54 రోజులూ చర్చించాలి. ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తేవాలి. ఎన్నికలంటే ద్వంద్వయుద్ధం కాదని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర భవిష్యత్తు విధ్వంసం అయింది. ప్రజల ఆకాంక్షలు చెదిరిపోయాయని చంద్రబాబు తెలిపారు. ఈ పుస్తకం అమరావతి రైతులు, మహిళలకు అంకితం చేయడం గర్వించదగిన విషయం అని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో మూడు రాజధానులు, ఇప్పుడు నాలుగో రాజధాని అని ఆరోపించారు. అధికారమిస్తే.. తాను, పవన్ ధృఢ సంకల్పంతో పనిచేస్తామని అన్నారు. అసెంబ్లీని కౌరవ సభ చేశారని మండిపడ్డారు. ఏపీలో పేదరికం లేకుండా చేస్తాం. 54 రోజుల తర్వాత మా బాధ్యత నెరవేర్చుతామని అన్నారు. వైసీపీ నేతలు చొక్కాలు మడత పెడితే.. మా టీడీపీ, జనసైనికులు కుర్చీలు మడత పెడతారని ఈ

చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.




Tags:    

Similar News