హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు.. అంతా అక్రమం అంటూ..

Byline :  Lenin
Update: 2023-09-12 05:42 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్‌కు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఊహించినట్లుగానే హైకోర్టును ఆశ్రయించారు. బాబు అరెస్ట్, రిమాండ్ అక్రమం అంటూ ఆయన న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరైన ఆధారాలు లేకుండా, రాజకీయ కక్షసాధింపుతో ప్రభుత్వం ఆయనకు జైలుకు పంపిందని ఆరోపించారు. బాబు  తరఫున ప్రముఖ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ వేశారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడును ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పిటిషన్‌పై కోర్టు రేపు (బుధవారం) విచారణ జరిపి తీర్పు ఇవ్వనుంది. 

మరోవైపు బాబును జైలుకు కాకుండా గృహనిర్బంధంలోనే ఉంచాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు మరి కాపేట్లో నిర్ణయం వెల్లడించనుంది. కరుడుగట్టిన నేరగాళ్లు ఉన్న రాజమండ్రి జైలులో చంద్రబాబు ఉంచడం వల్ల ప్రాణాలకు ముప్పు ఉటుంది కనుక హౌస్ అరెస్టులో ఉంచాలని బాబు న్యాయవాదులు కోరారు. జెడ్‌ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న రాజకీయ నాయకుడిని ఖైదీలతో కలిపి ఉండంచడమే భద్ర విషయం రాజీ పడినట్టేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, బాబుకు జైల్లో గట్టి భద్రత కల్పించామని, ఆయన ఉంటున్న స్పెషల్ వార్డులోకి సిబ్బందిని తప్ప ఎవరినీ అనుమతించడం లేదని జైలు అధికారులు చెప్పారు.

Tags:    

Similar News