Chandrababu Naidu : సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు

Byline :  Kiran
Update: 2023-10-31 11:05 GMT

టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టైన ఆయనకు హైకోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. దాంతో 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి బయట అడుగుపెట్టారు.

నారా లోకేష్, బ్రాహ్మణి, నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఏలూరి సాంబశివరావు, టి.డి.జనార్దన్‌ తదితరులు రాజమహేంద్రవరం జైలు వద్దకు వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు విడుదల కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. 52 రోజులుగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు.




Tags:    

Similar News