Chandrababu Naidu : ఆ 20 మంది టీడీపీ నేతలకు నో టికెట్.. స్పష్టం చేసిన చంద్రబాబు

Byline :  Bharath
Update: 2024-02-12 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024పై టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లొచ్చిన దగ్గరనుంచి దూకుడు పెంచారు. పొత్తులు, సీట్ల కేటాయింపుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో దాదాపు 15 నుంచి 20 మందికి (పోయినసారి టికెట్ పొందిన అభ్యర్థులు) టికెట్ ఇచ్చే ఆలోచనలో లేనట్లు అర్థం అవుతుంది. దీంతో పాటు ఒక కుటుంబంలో ఒకే టికెట్ అనే విషయంపై కూడా ఆయన స్పష్టంగా ఉన్నారట. పార్టీకి ఎంత కావాల్సిన వారైనా సరే.. రెండో టికెట్ ఇచ్చేది లేదని ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు అర్థం అవుతుంది. కాగా పరిటాల, జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల జయప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు టీడీపీ నుంచి రెండో టికెట్ ఆశిస్తున్నారు. అయితే వీరికి కూడా రెండో టికెట్ ఇచ్చే సంకేతాలు లేనట్లు తెలుస్తుంది.

అటు మైలవరం స్థానంపై కూడా క్లారిటీతోనే ఉన్నారు. సుధీర్ఘ కసరత్తుల తర్వాత ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయంచుకున్నారు. అదే విషయాన్ని టీడీపీ ఇంచార్జీ దేవినేని ఉమకు కూడా చెప్పినట్లు సమాచారం. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు చంద్రబాబు.. పెడన విషయంలో కొన్ని సూచనలు చేశారట. రానున్న ఎన్నికల కోసం పార్టీ శ్రేణులంతా జాగ్రత్తగా పనిచేస్తే.. గెలిచి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంచార్జుల మార్పు, టికెట్ల నిరాకరణపై వైసీపీలోనూ విభేదాలు మొదలయ్యాయి. దీంతో టీడీపీలో ఏం జరుగుతుంది అని పలువురు శ్రేణుల్లో ఆందోళన మొదలయింది.

Tags:    

Similar News