chandrababu naidu : ఇవాళ్టితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..
Byline : Krishna
Update: 2023-09-24 03:44 GMT
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ్టితో చంద్రబాబు సీఐడీ కస్టడీ, రిమాండ్ ముగియనుంది. ఈ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న బాబును సీఐడీ ఇవాళ రెండో రోజు విచారిస్తోంది. . సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తవగా.. కాసేపట్లో అధికారులు విచారించనున్నారు. నిన్న ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు అధికారులు చంద్రబాబును విచారించారు.
రెండు విడతల్లో కలిపి దాదాపు 6 గంటలపాలు చంద్రబాబును అధికారులు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారు..? గంటా సుబ్బారావును ఎందుకు కీలక బాధ్యతలు అప్పగించారు.. వంటి పలు ప్రశ్నలను అధికారులు సంధించినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ విచారణ ముగిసిన తర్వాత చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరుస్తారు.