Srivari Brahmotsavam: చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న శ్రీవారు

By :  Kiran
Update: 2023-09-24 14:23 GMT

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే బంగారు గొడుకు ఉత్సవం ఘనంగా జరిగింది. సోమవారం శ్రీవారి రథోత్సవం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం శ్రీవారి కల్యాణ కట్ట సిబ్బంది నూతన ఛత్రస్థాపన చేశారు. ప్రధాన కల్యాణ కట్టలో బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కల్యాణ కట్ట సిబ్బంది గొడుగును టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డికి అప్పగించారు.

తిరుమలలో మొట్టమొదటిసారిగా కల్యాణకట్టను ఏర్పాటుచేసి భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు వసతి కల్పించిన వంశీయులు శ్రీవారి రథానికి గొడుగు సమర్పించ‌డం ఆచారంగా వస్తోంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం మహంతుల పాలనలోనూ కొనసాగింది. 1946లో సంవత్సరంలో కల్యాణకట్టను టీటీడీకి అప్పగించినప్పటికీ బంగారు గొడుగు ఉత్సవం మాత్రం కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు తిరు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు.. రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహిస్తున్నారు.

Tags:    

Similar News